లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న చరణ్
Ram Charan to take a long break
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది రిలీజ్ తర్వాత మళ్లీ మీడియా కి కనిపించలేదు. పాన్ ఇండియా మార్కెట్ లో రెస్ట్ లేకుండా పెద్ది ని ప్రమోట్ చేసిన రామ్ చరణ్ విజయవాడ ఈవెంట్ తర్వాత ఫ్యాన్స్ కుందుకు రాలేదు. పెద్ది రిలీజ్ తర్వాత ఉపాసన అలాగే చరణ్ అక్క సుష్మిత మెగా ఫ్యాన్స్ ని కలిశారు. వారికి హాయ్ చెప్పారు.
రామ్ చరణ్ చేతికి శస్త్ర చికిత్స తీసుకుంటున్నారు, అందుకే ఆయన పబ్లిక్ లోకి రావడం లేదు అంటున్నారు. రామ్ చరణ్ పెద్ది సెట్ లో చేతికి దెబ్బ తగిలించుకున్నారు పెద్ది రిలీజ్ తర్వాత దానికి ఓ సర్జరీ అవసరం ఉంది అని పెద్ది నిర్మాత చెప్పారు. అన్నట్టుగానే రామ్ చరణ్ చేతికి సర్జరీ చేయించుకోబోతున్నారు.
ఆతర్వాత కొద్ధి రోజులు కాదు లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారు, రామ్ చరణ్ రెండు మూడు నెలల తర్వాతే సుకుమార్ తో చేయబోయే RC 17 సెట్ లోకి వెళతారని తెలుస్తుంది. పెద్ది కోసం రామ్ చరణ్ గత ఏడాదిన్నరగా చాలా కష్టపడ్డాడు. చరణ్ కష్టం స్క్రీన్ పై తెలుస్తుంది. పెద్ది లో రామ్ చరణ్ కష్టం గురించి సాధారణ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.
సో చరణ్ పెద్ది నుంచి కాస్త రిలాక్స్ అయ్యి లాంగ్ బ్రేక్ తో సుకుమార్ ప్రాజెక్ట్ లోకి వెళతారని తెలుస్తుంది.







































