ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raghava Lawrence Set For Political Entry

పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ కీలక ప్రకటన

Raghava Lawrence Set For Political Entry

 

రీసెంట్ గా విజయ్ టీవీకే పార్టీ నుంచి నటుడు రాఘవ లారెన్స్ పోటీకి సిద్ధమవుతున్నారు. విజయ్ పోటీ చేసిన ఈస్ట్ తిరుచ్చి నుంచి రాఘవ లారెన్స్ పోటీలో ఉంటున్నారు. విజయ్ పార్టీ ద్వారా రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.

ఆ విషయమై విజయ్ టీవీకే పార్టీ నేతలు కానీ, రాఘవ లారెన్స్ కానీ స్పందించలేదు. తాజాగా రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. తిరుచ్చి ఈస్ట్ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటూ రాఘవ లారెన్స్.. తను ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పారు.

జూన్ 11 ఉదయం 9:30 గంటలకు, నా జీవితానికి సంబంధించి కీలక నిర్ణయం ప్రకటిస్తా, అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నా అంటూ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

Raghava Lawrence Tweet On Political Entry