AA - లోకేష్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?
Allu Arjun's AA23 With Lokesh Kanagaraj Shelved?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం AA 22 రాకా చిత్రాన్ని అట్లీ తో చేస్తున్నారు. ఈ చిత్రం 2027 లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం ఇంకా ఫినిష్ అవ్వకుండానే అల్లు అర్జున్ మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. లియో, కూలి చిత్రాలతో డిజప్పాయింట్ చేసిన లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కి ఏం చెప్పి ఒప్పించాడా అనుకున్నారు.
అల్లు అర్జున్ బర్త్ డే రోజున లోకేష్ కనగరాజ్ తో AA 23 చిత్ర అఫిషియల్ అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. ఇక ఈ చిత్రంపై అందరిలో మంచి అంచనాలు ఉన్న సమయంలో #AA 23 ఆగిపోయింది అనే వార్తలు అల్లు ఫ్యాన్స్ ని బాగా నిరాశ పరిచాయి.
అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ చిత్రం ఆగిపోయింది అని, అల్లు అర్జున్ కి లోకేష్ కనగరాజ్ పై కోపం వచ్చింది అనే గుసగుసలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఈ AA 23 ప్రాజెక్ట్ ఉందా అటకెక్కిందా అనేది టీం క్లారిటి ఇస్తేనే తెలుస్తుంది.







































