Advertisement

నిర్మాత లీక్స్: ప్ర‌భాస్ ఆ చిన్న అల‌క వెన‌క‌

ప్రభాస్ ఒక ప్ర‌ముఖ నిర్మాత‌పై అల‌క‌బూనారా? అంటే అవున‌నే తాజా ఇంట‌ర్వ్యూ రివీల్ చేసింది. ప్ర‌భాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన వర్షం సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన జ్ఞాపకాలను నిర్మాత ఎం.ఎస్.రాజు తాజాగా పంచుకున్నారు. సినిమా ప్రారంభంలో ప్రభాస్ అడిగిన ఒక చిన్న ప్రశ్నకు క్రియేటర్‌గా తాను కొంత హర్ట్ అయిన మాట వాస్తవమేనని, అయితే తన భార్య చొరవతో ఆ సమస్య వెంటనే సమసిపోయిందని ఆయన వెల్లడించారు. సూర్యనారాయణ రాజు, కృష్ణంరాజుల కుటుంబ నేపథ్యాన్ని చూసి సినిమా చేయమని తన భార్య ఇచ్చిన సలహాతో ముందుకు సాగానని, ఆ తర్వాత ప్రభాస్‌తో ఏర్పడిన క్లారిటీతో ఒక తండ్రి కొడుకుల అనుబంధంలా మారిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రభాస్ తనను ఎంతగా నమ్మేవాడంటే.. దూకేయ్ అంటే దూకేసేవాడు, పరిగెత్తు అంటే పరుగెత్తేవాడు, డాన్స్ చెయ్ అంటే డాన్స్ చేసేవాడ‌ని ఎం.ఎస్.రాజు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ప్రభాస్‌ను ఎంతో ఆత్మీయంగా అబ్బాయి అని పిలిచేవాడినని, ఇప్పుడు అతను గ్లోబల్ స్టార్ అయినా.. తన దృష్టిలో ఇంకా అబ్బాయేన‌ని అన్నారు.

మహేష్ బాబుకు `ఒక్కడు`లా ప్ర‌భాస్ కోసం ఒక సినిమా ఇవ్వాల‌ని తాను భావించిన‌ట్టు ఎంఎస్ రాజు చెప్పారు. తాను ఆశించిన‌ట్టే వ‌ర్షం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని ఇవ్వ‌గ‌లిగాన‌ని తెలిపారు. నిజానికి వీరిద్దరి మధ్య చిన్న పాటి అల‌క‌లు ఉన్న విష‌యం ఇప్ప‌టికి రివీల్ చేసారు. ఏవో ఈగో ఇష్యూస్ ఉన్నాయ‌నే వార్తల్లో నిజం లేదని ఈ ఇంటర్వ్యూతో స్పష్టమైంది.

Varsham MoviePrabhas - Varsham
Advertisement
Advertisement