Advertisement

పెద్ది vs డ్రాగన్


ఈ ఏడాది వేసవి సెలవలు ఐస్ క్రీమ్ లా కరిగిపోతున్నాయి. కానీ సమ్మర్ లో పెద్ద సినిమాలు విడుదల కాక ప్రేక్షకులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. మే లో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు, ఒక్క బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లేవు. సమ్మర్ మొత్తం బోరింగ్ గా గడిచిపోతుంది.

అయితే పెద్ద సినిమాలు లేకపోతేనేమి.. ఈ నెలలో బిగ్ బడ్జెట్ మూవీస్ అప్ డేట్స్ రాబోతున్నాయి. అందులో రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ ఈ నెల మూడో వారం అంటే ఏప్రిల్ 18 న రిలీజ్ చేస్తున్నారు. దీనితోనే పెద్ది ప్రమోషన్స్ గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో మొదలు కాబోతున్నాయి.

ఇక మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే. ఎన్టీఆర్-నీల్ మూవీ డ్రాగన్ నుంచి గ్లింప్స్ రాబోతున్నాయి. ఆ రెండు రోజులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో కనబడుతుంది. సో పెద్ద సినిమాలు రిలీజ్ లు లేకపోయినా.. పెద్ద సినిమాల బిగ్ అప్ డేట్స్ తో అభిమానులు, ఆడియన్స్ సర్దుకుపోవాల్సిందే. 

Summer Special - Peddi vs DragonPeddi vs Dragon
Advertisement
Advertisement