Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chitrangada Singh recalls missed opportunity to work with Aditya Dhar

చేజారిన అవకాశంపై నటి ఆసక్తికర వ్యాఖ్యలు!

Chitrangada Singh recalls missed opportunity to work with Aditya Dhar

బాలీవుడ్ విలక్షణ నటి చిత్రంగద సింగ్ తాజాగా  కెరీర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. `ఉరి: ద సర్జికల్ స్ట్రైక్` వంటి సంచలన చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తాను నటించాల్సింద‌ని  తెలిపారు. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని షూటింగ్ ప్రారంభించడానికి అంతా సిద్ధమైందని పేర్కొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదన్నారు. ఆ అవకాశం చేజారిపోవడం పట్ల  అసంతృప్తిని వ్యక్తం చేశారు.

చిత్రంగద సింగ్ మాట్లాడుతూ,  `ఆదిత్య ధర్ అప్పట్లో ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌తో తనను సంప్రదించారని తన పాత్ర కూడా చాలా బలంగా డిజైన్ చేసారని గుర్తు చేసుకున్నారు. `మేము సినిమా గురించి సుదీర్ఘంగా చర్చించాం. అన్నీ అనుకూలించాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు` అని  వివరించారు. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ , ఆయన విజన్ తనకు చాలా ఇష్టమని, భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు చిత్రంగద  మనసులోని మాటను బ‌య‌ట పెట్టారు.

ప్రస్తుతం ఆదిత్య ధర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా చిత్రంగద సింగ్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ,  సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచు కుంటు న్నారు.  గొప్ప దర్శకుడితో పని చేసే అవకాశం మిస్  అయినా?  సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ తమ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంద‌ని   ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Was A Lot Of Back and Forth: Chitrangda Singh Opens Up About Almost Collaborating