Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dileep Raj dies at 47 after suffering heart attack

కన్నడ నటుడు దిలీప్ రాజ్ హఠాన్మరణం

Dileep Raj dies at 47 after suffering heart attack

కన్నడ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ (47) ఈరోజు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందడం కలకలం సృష్టించింది. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

కానీ అప్పటికే దిలీప్ రాజ్ పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను బతికించలేకపోయారు. దానితో కన్నడ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి ఘటనలు ఎన్నో సినిమా ఇండస్ట్రీస్ లో జరుగుతున్నాయి. కన్నడ పునీత్ రాజ్ కుమార్, అలాగే హిందీ నటులు  గుండెపోటుతో అతి చిన్న వయసులోనే కన్నుమూసిన సందర్భాలు ఈమధ్య కాలంలో ఎన్నో వింటున్నాం.

కెరీర్‌లో 24కు పైగా చిత్రాల్లో నటించిన దిలీప్.. సినిమా, టీవీ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.

Kannada actor-producer Dileep Raj dies at 47 after suffering heart attack