ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kalki sequel To Face Heat From Hollywood Biggies

హాలీవుడ్ దిగ్గజాల మ‌ధ్య‌లో ప్రభాస్ బ‌రిలోకి!

Kalki sequel To Face Heat From Hollywood BiggiesKalki sequel To Face Heat From Hollywood Biggies

 

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `కల్కి 2898 AD` సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇప్పుడా  చిత్రానికి  భారీ సీక్వెల్ గా  `కల్కి 2` తెర‌కెక్కుతోన్న సంగ‌తి విధితమే. ఇప్ప‌టికే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టిన చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది.   ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంద‌ని తెలిసింది. మొదటి భాగం ముగిసిన చోటు నుండే రెండో భాగం ప్రారంభం కానుందని సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) , భైరవ (ప్రభాస్), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్)ల మధ్య జరిగే అసలు యుద్ధం ఈ సీక్వెల్‌లో ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎదుర్కోబోయే పోటీ  కూడా  హాట్ టాపిక్‌గా మారింది. 2027 డిసెంబర్ నెలలో హాలీవుడ్ భారీ ప్రాజెక్టులైన `అవెంజర్స్: సీక్రెట్ వార్స్`, `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది హంట్ ఫర్ గొల్లమ్` వంటి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.  వీటితో పాటు బాలీవుడ్ కల్ట్ హిట్ సీక్వెల్ `తుంబాడ్ 2` కూడా అదే సమయంలో వచ్చే అవకాశం రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.  ఇలాంటి పోటీ  న‌డుమ `క‌ల్కి 2` అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సూపర్ హీరోలతో తలపడటం భారతీయ సినీ ప్రేమికులకు గొప్ప అనుభూతిని అందించ‌నుంది.

`క‌ల్కి 2` 2027 ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తవుతుంద‌ని స‌మాచారం.  మిగిలిన సమయాన్ని విజువల్ ఎఫెక్ట్స్  కోసం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండులు షూటింగ్ లో జాయిన్ అవ్వ‌డంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో `కల్కి 2` కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

Kalki Sequel To Face Stiff Competition From Hollywood