RC17 షూటింగ్ స్టార్ట్ అప్పటినుంచే


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది జూన్ 4 న విడుదల చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా పెద్ది స్పెషల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో పూర్తయ్యింది. రామ్ చరణ్-శృతి హాసన్ లపై పెద్ది సాంగ్ ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించారు దర్శకుడు బుచ్చి బాబు. పెద్ది షూటింగ్ కొలిక్కి రావడమే తరువాయి మే లో పాన్ ఇండియా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నారు.
పెద్ది ప్రమోషన్స్ ఓ కొలిక్కి వచ్చాక రామ్ చరణ్ తన తదుపరి చిత్రం సెట్స్ పైకి వెళ్తారట. రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత RC 17 స్క్రిప్ట్ పైనే ఉన్న సుకుమార్ రామ్ చరణ్ కోసం వెయిటింగ్. అయితే RC 17 జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట.పెద్ది పనులు పూర్తి కావడమే చరణ్ RC 17పైకి వెళ్ళిపోతారట.
సో రామ్ చరణ్ పెద్ది తర్వాత ఏ మాత్రం బ్రేక్ లేకుండా సుక్కు ప్రాజెక్ట్ పైకి వెళ్ళిపోతారని, ఇప్పటికే RC 17 లో హీరోయిన్ విషయంలోనూ, కీలక నటుల విషయంలో సుకుమార్ ఆలోచనలు ఓ కొలిక్కి వచ్ఛాయని తెలుస్తుంది. హీరోయిన్ గా మాత్రం చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి.

Ram Charan RC 17 newsRC 17 update