Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ - హిట్టు బొమ్మ

నిన్నటివరకు ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మిగతా హీరోల అభిమానులు పెడుతున్న కామెంట్స్ చూసి పవన్ ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. హరీష్ శంకర్ అంత పవర్ ఫుల్ గా ఉస్తాద్ లో పవన్ ని చూపించినా, డైలాగ్స్ అదిరిపోయినా బాలీవుడ్ ధురంధర్ 2 ముందు ఉస్తాద్ తేలిపోతుందేమో అనే అనుమానాలు కనిపించాయి. ఉస్తాద్ కి క్రేజ్ రావట్లేదు అని కూడా అన్నారు.

ఇప్పుడు యాంటి ఫ్యాన్స్ లోను ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిప్రాయాలు మారుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసాక, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన మాటలు, అంతేకాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఈ రోజు సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో యూనిట్ సంభ్యులు, కొంతమంది సినీప్రముఖులు చూసి హిట్టు బొమ్మ అని మాట్లాడుకుంటున్నారట.

సినిమా అంచనాలకు మించి ఉండబోతుంది. మెయిన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వల్ ఎపిసోడ్ అదిరిపోయింది, డైలాగులు సూపర్ అని మాట్లాడుకోవడం చూసిన యాంటీ ఫ్యాన్స్ కూడా పవన్ ఫ్యాన్స్ కి కంగ్రాట్స్ చెబుతూ పాజిటీవ్ గా ట్వీట్లు పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి విందు భోజనం లెక్క.. ముందుగా అభిమానులకి కంగ్రాట్స్. గబ్బర్ సింగ్ కి ముందు కూడా ఏం అంచనాలు లేవు, రిలీజ్ అయ్యాక మార్నింగ్ షో నుంచే అంతా చేంజ్ అయిపోయింది. ఈ బొమ్మ కూడా అంతే అంటున్నారు.. 

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh - Hittu Bomma
ustaad bhagat singh