Loading...

వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయి రెడ్డి

Vijayasai Reddy

వైసీపీ ప్రభుత్వ ఎంపీ గా టీడీపీ పై చంద్రబాబు, లోకేష్ లపై చెలరేగిపోయిన విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ పార్టీకి బై బై చెప్పడమే కాదు అసలు రాజకీయాల్లోనే ఉండడం లేదు అంటూ షాకిచ్చారు. విజయ్ రెడ్డి పై పెట్టిన లిక్కర్ స్కామ్ కేసు వల్లో, ఇతర బిజినెస్ ల వల్లో వైసీపీ పార్టీలోనే ఉంటే కూటమి ప్రభుత్వం వదలదు అని విజయ్ సాయి ఫిక్స్ అయ్యి రాజకీయాలు నుంచి తప్పుకున్నారు.

ఆతర్వాత వైసీపీ పార్టీ, జగన్ vs విజయ్ సాయి మధ్యన మాటల యుద్ధం నడిచింది. అయితే విజయ్ సాయి రెడ్డి బిజెపి లో చేరుతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టడమే కాదు, వైసీపీ పార్టీ నేతలు అదే అన్నారు. కానీ ఆయన ఇక ఏ పార్టీలోకి  చేరలేదు. ఇపుడు తాజాగా విజయసాయి వ్యవహారం చేసుకుంటున్నట్టుగా ఓ వీడియో షేర్ చేసారు.

శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తాము.. అంటూ ఆయన చెట్లకు స్ప్రే చేస్తున్న వీడియో షేర్ చేశారు. 

 

 

 

Vijayasai Reddy

vijayasai reddy