ఉస్తాద్ బిజినెస్ చూస్తే మతిపోవాల్సిందే

మార్చ్ 19 న మాంచి అంచనాలతో బాక్సాఫీసు ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ వెయిట్ చేసేలా చేసింది.. రీసెంట్ గా వదిలిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్. ట్రైలర్ లోని ప్రతి డైలాగ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
మరి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీసు టార్గెట్ రూ.200 కోట్లు అంటూ అప్పుడే పవన్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెన్స్ తో కనిపిస్తుంటే రెండు రాష్ట్రాలకు కలిపి అన్ని ఏరియాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఏకంగా రూ.120 కోట్ల మేర బిజినెస్ చేసింది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హరీష్ శంకర్ పవన్ ని చూపించిన తీరు, ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని హైలెట్ సినిమాలో అవ్వబోతున్నాయి.
పవర్ స్టార్ సినిమా అంటే ఉండే క్రేజ్ చూసే ఈ రేంజ్ లో ఉస్తాద్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒన్స్ ఉస్తాద్ కి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు థియేటర్స్ మొత్తం దుమ్మురేగిపోతుంది. ఉస్తాద్ బలమేమిటో, బలహీనత ఏమిటో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేస్తే సరి.
Ustaad Bhagat Singh Business Details Out
Ustaad Bhagat Singh Business Details








































