విజయ్ తో పొత్తుపై పవన్ హాట్ కామెంట్స్
Pawan Kalyan comments on his alliance with Vijayతమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, ఎవరితో కలిసి విజయ్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారు, విజయ్ TVK పార్టీ బిజెపి తో పొత్తు పెట్టుకుంటుంది అనే వార్తలను విజయ్ కొట్టిపారేస్తూ తమిళనాట త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని తేల్చేసారు.
ఇదిలా ఉండగా.. విజయ్ TVK పార్టీని NDA కలిసి పొత్తు పెట్టుకోవడం కోసం జనసేన నేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.. NDA-విజయ్ TVK పార్టీ లు కలిసి పోటీ చేస్తాయి, దీని కోసం పవన్ TVK విజయ్ తో చర్చలు జరుపుతున్నారనే వార్తలను జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. నా వైపు నుంచి TVK - NDA అలయన్స్ గురించి ఎలాంటి ప్రతిపాదన లేదు..
అసలు ఈ వార్త ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను విజయ్ ని 25 ఏళ్ల క్రితం కలిసాను.. ఇప్పటివరకు కలవలేదు. అంతేకాదు అసలు రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూ లో విజయ్ తో పొత్తు కోసం NDA తరపున తను ఎలాంటి ప్రయాతం చెయ్యలేదు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan On Bringing Vijay Into NDA







































