Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Varma Fires on Pithapuram Municipality Staff

అధికారులపై పిఠాపురం వర్మ ఫైర్

Varma Fires on Pithapuram Municipality Staff

పిఠాపురంలో ఎప్పటికప్పుడు జనసేన తో టీడీపీ వర్మ గొడవపడుతూనే ఉంటారు. నాగబాబు ఎమ్యెల్సీ అయినప్పుడు జరిగిన గొడవల కారణముగా ఆతర్వాత నాగబాబు పెద్దగా పిఠాపురం రాజకీయాల్లో కలగజేసుకోవడం లేదు. ఇప్పుడు మరోసారి వర్మ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. 

కారణం అక్కడొక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా పెట్టారంటూ వర్మ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చంద్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పెద్దదిగా పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నదిగా పెట్టారంటూ వర్మ ఫైర్ అవడం హాట్ టాపిక్ గా మారింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ని అవమానిస్తే ఊరుకునేది లేదు, ఫోటో మరీ స్టాంపు సైజులో వేశారని ఆయన మండి పడ్డారు. గతంలోనూ సంక్రాంతి సంబరాల సమయంలోను బాబు ఫోటో పెట్టలేదు, ఇప్పుడిలా అంటూ పిఠాపురం వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. 

TDP Leader Varma Fires on Pithapuram Municipality Staff

varma