Loading...

అల్లు అర్జున్ పై ఆ రూమర్స్ నిజమేనా..

Allu Arjun - Sneha Reddy

కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ ని కలవాలన్నా, ఆయన తో మాట్లాడాలన్నా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ బాలీవుడ్ పాడ్ కాస్ట్ యాంకర్ కావేరి బారువా మాట్లాడిన మాటలపై అల్లు ఫ్యాన్స్ ఫైర్ అవడమే కాదు అల్లు టీమ్ లీగల్ గా కూడా ప్రొసీడ్ అవడం, ఆతర్వాత కావేరి బారువా క్షమాపణలు కోరడం.. ఈలోపే టాలీవుడ్ నుంచి కొంతమంది అల్లు అర్జున్ అలాంటి వారు కాదు, నేను ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడతారు. ఇలాంటి రూల్స్ మేము చూడలేదు అంటూ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేశారు.

అదంతా ఓకే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవడం చూసాక అల్లు అర్జున్ 40 కండిషన్స్ నిజమేనా అనుకునేలా మరోమారు చర్చ కు తెరలేపారు. నిన్న గురువారం సాయంత్రం కోకాపేట లోని అల్లు సినిమాస్ ఓపెనింగ్ కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ మొత్తం హాజరైంది. అల్లు అర్జున్ తన వైఫ్ స్నేహ తో, శిరీష్ తన వైఫ్ నయనికా తో, అల్లు అరవింద్ తన భర్యతో అలాగే బాబీ తన భార్య తో కలిసి వెళ్లారు.

అయితే అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డి తో కలిసి ఈ ఓపెనింగ్ కి వస్తున్న క్రమంలో అల్లు అర్జున్, స్నేహ ల పక్కనే దగ్గరగా నడిచే వ్యక్తులను అల్లు అర్జున్ సీరియస్ గా చూడగానే వారు స్నేహ రెడ్డికి కొద్ధిదూరం జరిగి నడుస్తున్న వీడియో చూసిన వారు అల్లు అర్జున్ చూసారా కంటి సైగతో తమకు దూరంగా ఉండమని శాసిస్తున్నాడు, 40+ కండిషన్స్ అంటే జోక్ అనుకున్నా.. 

నిజమే అల్లు అర్జున్ అలానే కండిషన్స్ పెట్టి ఉంటాడు, అది ఈ వీడియో చూసాక 100 శాతం నిజమనిపిస్తుంది అంటూ ఆ వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు. 

Allu Arjun - Sneha Reddy at Allu Cinemas opening

allu arjun