ఓపెన్ గ్రౌండ్ లో ఉస్తాద్ సిక్సర్
Ustaad Bhagat Singh release on March 19thసంక్రాంతి వెళ్ళింది.. మళ్లీ ఇప్పటివరకు క్రేజీ మూవీ ఏది బాక్సాఫీసు ను కదిలించలేకపాయింది. మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి చిత్రాలు బాక్సాఫీసుని షేక్ చేస్తే.. మళ్లీ ఆ రేంజ్ సినిమా మార్చి 19 న రాబోతుంది. ఈ శుక్రవారం ఏ సినిమా రిలీజ్ కాలేదు. ప్రేక్షకులు ఆకలిమీదున్నారు.
అందుకే రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. హీరోయిన్ రాశి ఖన్నా తో కలిసి మూడో సాంగ్ రిలీజ్ చేశారు. మార్చ్ 14 న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రాబోతుంది. ఇప్పటివరకు ఒక లెక్క ట్రైలర్ వచ్ఛాక ఒక లెక్క అన్నట్టుగా ఉస్తాద్ భగత్ సింగ్ హైప్ ఉండబోతుంది.
ప్రస్తుతం నిస్తేజంగా పడి ఉన్న బాక్సాఫీసుని ఉస్తాద్ భగత్ సింగ్ తట్టి లేపబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీమియర్స్ లేవు అంటున్నారు. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లెమ్. ఉస్తాద్ భగత్ కి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సునామి, జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా ఉస్తాద్ భగత్ సింగ్ కి సూపర్ హిట్ కలెక్షన్స్ కట్టబెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు.
మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెన్ గ్రౌండ్ లో సిక్స్ కొడితే.. పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు, దాని కోసం బాక్సాఫీసు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తుంది.
Ustaad Bhagat Singh







































