పర్సనల్ విషయాలు మీకెందుకు - రష్మిక ఫైర్
Rashmika gives strong warningనేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గానే తను కోరుకున్న వాడు, ప్రేమించిన ప్రియుడు విజయ్ దేవరకొండ ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే రష్మిక కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే ఆమె తోటి నటుడు రక్షిత్ తో ప్రేమలో పడి అంతే స్పీడుగా ఎంగేజ్మెంట్ చేసింది.
తర్వాత కెరీర్ కోసం ప్రేమను, ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్న రష్మిక ఆతర్వాత విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకున్నది.. రక్షిత్ శెట్టి, అతని ఫ్యామిలీ రశ్మికను వేధించడం వల్లనే, రష్మిక పెళ్లి తర్వాత కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని, నటనకు గుడ్ బై చెప్పాలని ఒత్తిడి తీసుకు రావడంతోనే తన రష్మిక ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుంది అంటూ ఆమె తల్లి ఆడియో ఒకటి లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.
అయితే ఆ ఆడియో వైరల్ అవడంతో రష్మిక ఫైర్ అయ్యింది. నా పర్సనల్ విషయాలపై ఇతరుల జోక్యం అనవసరం. నా పాత ప్రైవేట్ ఆడియోను లీక్ చేశారు. నా ఫ్యామిలీ, స్నేహితుల ప్రైవసీని దెబ్బతీస్తున్నారు. సోషల్ మీడియా నుంచి 24 గంటల్లో ఆ ఆడియో కంటెంట్ తొలగించాలి. ఆ కంటెంట్ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటూ సోషల్ మీడియా వేదికగా రష్మిక నోట్ రాసింది.
Rashmika Mandanna threatens strong action







































