అల్లు అర్జున్ బర్త్ డే కి మూడు సర్ ప్రైజ్ లు
Three surprises for Allu Arjun birthdayఏప్రిల్ 8 అల్లు ఫ్యాన్స్ కి బిగ్ డే. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో అల్లు అర్జున్ బర్త్ డే. పుష్ప తో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ బర్త్ డే అంటే సోషల్ మీడియా షేకైపోవాలి. అదే ఇప్పుడు జరుగుతుంది. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ AA 22 చిత్రం అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నారు, ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది.
AA 22 అనౌన్సమెంట్ వీడియో తప్ప ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబందించిన ఏ అప్ డేట్ రాలేదు. అవన్నీ అల్లు అర్జున్ బర్త్ డే కోసం మేకర్స్ అట్టే పెట్టారు. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే కి అట్లీ అభిమానుల కోసం మూడు సర్ ప్రైజ్ లు అందించబోతున్నాడట. అందులో ఒకటి AA 22 నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్..
రెండివది టైటిల్, మూడోది ఈ చిత్ర రిలీజ్ డేట్ ని కూడా అల్లు అర్జున్ బర్త్ డే రోజునే అనౌన్స్ చేయబోతున్నారట. సో అల్లు అర్జున్ బర్త్ డే కి ఒక్క ప్రాజెక్ట్ నుంచే మూడు ట్రీట్స్ ని అల్లు ఫ్యాన్స్ అందుకోబోతున్నారన్నమాట. ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా AA 23 కి సంబంధించి అల్లు అర్జున్ బర్త్ డే కి ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.
AA22xA6 title set for reveal on Allu Arjun birthday







































