Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Woman declared brain dead by doctors returns to life in UP Pilibhit

ఆయుష్షు ఉంటే చావును తప్పించుకోవచ్చు

Woman declared brain dead by doctors returns to life in UP Pilibhit

భూమి మీద నూకలు ఉంటే చావు నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే సామెతను ఇప్పుడొక మహిళ విషయంలో నిజమైంది. బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ప్రకటించిన తర్వాత ఆమె బ్రతికి బట్టగట్టడం అంటే మాములు విషయం కాదు. బ్రెయిన్ డెడ్ అంటే బాడీ లోని ఏ పార్ట్ పని చెయ్యదు, కోమాలో ఉంటారు. అచేతనంగా చావు కోసం ఎదురు చూస్తారు. వాళ్లకు పెట్టిన వెంటిలేటర్ తీసేస్తే చావుని కౌగిలించుకుంటారు.

కానీ ఓ మహిళ విషయంలో మిరాకిల్ జరిగింది. ఫిలిభిత్ జిల్లాకు చెందిన వినితా శుక్లా తన ఇంటి దగ్గర పనులు చేస్తుండగానే ఏమైందో ఏమో ఒక్కసారిగా కిందపడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఫ్యామిలీ మెంబెర్స్ ఆమెను మెరుగైన చికిత్స కోసం బరేలీలోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అక్కడి వైద్యులు ఆమెకు బ్రెయిన్ డెడ్ అయ్యింది అని ఇంటికి తీసుకెళ్ళిపొమ్మని చెప్పగా చేసేది లేక కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో ఇంటికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుని ఇంటి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఆమెను అంబులెన్సు లో ఇంటికే తరలించే క్రమంలో అంబులెన్స్ ఓ గుంతలో పడగా బ్రెయిన్ డెడ్ పేషేంట్ కదిలి శ్వాస తీసుకోవడం మొదలు పెట్టగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు.

ఆ తర్వాత ఆమె 12 రోజుల పాటు ఐసీయూలో డాక్టర్స్ ఆధ్వర్యంలో పూర్తిగా కోలుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అందుకే అనేది ఆయుష్షు లేకపోతె చావును ఎవరూ తప్పించలేరు, భూమి మీద నూకలు ఉంటే చావుని ఎలాగైనా తప్పించుకోవచ్చు అనేది. 

UP Pilibhit

pilibhit