ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor, Rukmini Vasanth visited Tirumala

తిరుమలలో సందడి చేసిన NTR హీరోయిన్స్

Janhvi Kapoor, Rukmini Vasanth visited Tirumala

ఈరోజు మార్చ్ 6 న తిరుమల తిరుపతి లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిన్స్ ఇద్దరు శ్రీవారి దర్శనంలో తరించారు. దేవర చిత్రంలో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ నిన్న నైట్ తిరుమలకు మెట్ల మార్గం ద్వారా చేరుకొని ఈరోజు నైవేద్య విరామ సమయంలో జాన్వీ కపూర్ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈరోజు మార్చ్ 6 జాన్వీ కపూర్ బర్త్ డే. దానితో ఆమె తన ఆంటీ మహేశ్వరితో కలిసి నడక మార్గంలో తిరుమల చేరుకొని పట్టుపరికిణి లో సాంప్రదాయంగా స్వామి వారి దర్శనం చేసుకుంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న రుక్మిణి వసంత్ కూడా ఈరోజు శ్రీవారి ని దర్శించుకుంది.

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈరోజు శుక్రవారం విఐపి బ్రేక్ దర్శనంలో తన తల్లి, సోదరితో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. అంతేకాకుండా శ్రీవారి దర్శనానంతరం ఆమె అభిమానులకు సెల్ఫీ లు కూడా ఇచ్చిన వీడియో విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఒకే రోజు ఎన్టీఆర్ హీరోయిన్స్ ఇద్దరు తిరుమలలో సందడి చేశారు. 

Janhvi Kapoor, Rukmini Vasanth And Maheshwari Seek Blessings Lord Venkateswara

janhvi kapoor