అల్లు శిరీష్ రిసెప్షన్ కి హాజరైన బాలయ్య

Allu Sirish-Nayanika Reception

ఈరోజు మార్చ్ 2.. కోకాపేట మొత్తం సినీ, రాజకీయ ప్రముఖుల తో సందడిగా మారిపొయింది. మార్చి 6 న పెళ్లి చేసుకోబోతున్న అల్లు శిరీష్-నయనికా ల రిసెప్షన్ ని ఈరోజు అల్లు అరవింద్ ఫ్యామిలీ అల్లు స్టూడియోస్ లో ప్లాన్ చేసింది. కోకాపేట లో కోట్ల తో కట్టిన అల్లు స్టూడియోస్ లో అల్లు శిరీష్ రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహస్తున్నారు.

ఈ వేడుకకి జనసేన నేతలు, సినీ సెలబ్రిటీస్ హాజరవుతున్నారు. ప్రస్తుతం అల్లు స్టూడియోస్ లో జరుగుతన్న అల్లు శిరీష్ రిసెప్షన్ లో బ్రహ్మి, మోహన్ బాబు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. శిరీష్ తో ఫొటోస్, అల్లు అర్జున్ తో హగ్గులు తో బాలయ్య స్పెషల్ గా కనిపించారు. 

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, మెగా ఫ్యామిలీ సురేఖ, సుష్మిత, అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ లు ఈ వేడుకలో సందడి చేస్తున్నారు. అల్లు అరవింద్ కొడుకు రిసెప్షన్ వేడుకలో అందరిని పలకరిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్-నయనికా ల రిసెప్షన్ కన్నుల పండుగగా జరుగుతుంది. 

Allu Sirish-Nayanika Reception at ALLU Studios

allu sirish