పెళ్లి తర్వాత మొటిసారి జంటగా..
Newlyweds VD and Rashmika make their first public appearanceఎప్పుడు సీక్రెట్ గా వెకేషన్స్ కోసం విడి విడిగా ఎయిర్ పోర్ట్ నుంచి చెక్కేసే విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు మొదటిసారి పెళ్లి తర్వాత కలిసి అందరికి నమస్కారం చేస్తూ కనిపించారు. నిన్న ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ హిందీ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ఈ జంట సాయంత్రం రష్మిక ఫ్యామిలీ సంప్రదాయం కొడవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.
ఈరోజు ఉదయం విజయ్ దేవరకొండ-రష్మిక లు పెళ్లి తర్వాత మొదటిసారి పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్చారు. వైట్ కుర్తా సెట్ లో విజయ్ దేవరకొండ, రెడ్ కలర్ పైజామాలో కొత్త పెళ్లి కుమార్తె లా రష్మిక మందన్న సిగ్గులొలుకుతూ తొలిసారి ఉదయ్ పూర్ ఎయిర్పోర్ట్ లో కనిపించి సందడి చేశారు.
ఎప్పుడు విడిగా సీక్రెట్ ని మైంటైన్ చేసే విజయ్ దేవరకొండ-రష్మిక ఇప్పుడు జంటగా కనిపించడంతో అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. దానితో విజయ్ దేవరకొండ-రష్మికలు మీడియాకి, అభిమానులకు అభివాదం చేస్తూ గాల్లో ముద్దులు పెడుతూ వెళ్లిపోయారు.
Newlyweds Vijay Deverakonda and Rashmika Mandanna make their first public appearance






































