దర్శకుడిపై పాశవిక దాడి.. 11 మంది అరెస్ట్!
Director brutally attacked with cricket stumpsసినీరంగంలో కిడ్నాప్, దాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. కన్నడ సనీపరిశ్రమలో ఇలాంటి ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. `జీవనద భాషె` చిత్ర దర్శకుడు టి.ఎ. అనీష్ పై జరిగిన కిడ్నాప్, దాడి ఉదంతాన్ని పోలీసులు ఛేధించారు. కేవలం ఆర్థిక వివాదాల కారణంగా జరిగిన ఈ ఘోరకలిలో ఒక మహిళా నటి కూడా నిందితురాలిగా ఉండటం గమనార్హం.
ఈ కేసులో బాధితుడిని హనీట్రాప్ తరహాలో కిడ్నాప్ చేయడం ప్రధానంగా చర్చకు వచ్చింది. ముంబైలో ఉంటున్న అనీష్ తన కారును అమ్మాలని ప్రయత్నిస్తుండగా, నిందితులు దానిని అదునుగా చేసుకున్నారు. నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఐశ్వర్య ద్వారా అతడికి వల వేశారు. కారు కొంటామని నమ్మించి ఫిబ్రవరి 9న అనీష్‌ను బెంగళూరుకు పిలిపించి ఒక ఇంట్లో బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
అత్యంత పాశవికంగా వీడియో కాల్‌లో ఉండి మరీ దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అనీష్‌ను గదిలో బంధించి హాకీ స్టిక్స్, క్రికెట్ స్టంప్స్‌తో విచక్షణారహితంగా చితకబాదారు. దాడి జరుగుతున్న సమయంలో ప్రధాన నిందితుడు లక్ష్మీనారాయణ వీడియో కాల్ ద్వారా చూస్తూ అనీష్‌ను మరింత దారుణంగా కొట్టాలని మిగిలిన వారిని రెచ్చగొట్టాడు. గాయపడిన అనీష్ వద్ద నుంచి 22 గ్రాముల బంగారం, రూ. 30,000 నగదు లాక్కున్నారు. అంతేకాకుండా అతని ఏటీఎం కార్డు లాక్కొని బలవంతంగా పిన్ నంబర్ తెలుసుకుని మరీ డబ్బులు డ్రా చేశారు.
ఈ దారుణానికి సుమారు 8.5 లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలే మూలమని తెలుస్తోంది. నిందితుల్లో ఒకరైన ఆశీర్వాద్ తీసుకున్న అప్పు, లక్ష్మీనారాయణ సినిమా కోసం పెట్టిన పెట్టుబడి విషయంలో తలెత్తిన గొడవలే ఈ కిడ్నాప్‌కు దారితీశాయి. ఈకేసులో 11మందిని అరెస్ట్ చేసి వారి నుంచి దోపిడీ సొమ్ముల్ని రికవరీ చేస్తున్నారు.
Kannada director abducted, brutally beaten with hockey sticks and cricket stumps







































