ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwak Sen Funky to have an early OTT release

విశ్వక్ త్వరగా ఓటీటీ కి వస్తాడా..

Vishwak Sen Funky to have an early OTT release

లైలా, ఫంకీ రెండు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ నిరాశపరిచిన విశ్వక్ సేన్ ప్రస్తుతం కల్ట్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. అనుదీప్ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన ఫంకీ విశ్వక్ సేన్ ని బాగా డిజప్పాయింట్ చేసింది అనే చెప్పాలి. అనుదీప్ కామెడీ బుల్లితెర పై, ప్రమోషన్స్ లోను వర్కౌట్ అయినట్లుగా సిల్వర్ స్రీన్ పై వర్కౌట్ అవ్వలేదు.

విశ్వక్ సేన్ ఎంతగా కష్టపడినా ఫంకీ చిత్రం మాత్రం నిరాశను మిగిల్చింది. నాగవంశీ ఎంత కవర్ చేసినా ఫంకీ డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఫిబ్రవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫంకీ చిత్రం త్వరగా ఓటీటీ కి వచ్చే ఛాన్స్ వుంది అనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. 

అనుకున్న సమయానికన్నా ముందే విశ్వక్ సేన్ ఫంకీ ఓటీటీలోకి రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్య్యాయి. మూడు వారాలలోపే అంటే ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఫంకీ చిత్రం ఓటీటీ డెబ్యూ ఇవ్వొచ్చు. చూద్దాం ఈ ప్లాప్ ఫంకీ ఎప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందో అనేది. 

Vishwak Sen Funky Heads to OTT From This Date

vishwak sen