మొదటిసారి అనారోగ్యంపై స్పందించిన మమ్ముట్టి

Mammootty opens up about sensory loss

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కి క్యాన్సర్, అందుకే ఆయన సినిమా నుంచి, నటన నుంచి బ్రే తీసుకున్నారు, మమ్ముట్టి విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నటుడు మోహన్ లాల్ తన స్నేహితుడు మమ్ముట్టి ఆరోగ్యం కోసం శబరిమలై లో పూజలు నిర్వహించారు అంటూ మమ్ముట్టి ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వినిపించాయి.

రీసెంట్ గా మమ్ముట్టి హెల్త్ ఇష్యుస్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో సినిమా సెట్ లోకి అడుగుపెట్టారు. అసలు మమ్ముట్టికి ఏమైంది, ఆయన అనారోగ్యం ఏమిటి అనే విషయంలో ఎక్కడా క్లారిటీ లేదు. కానీ మమ్ముట్టి మొదటిసారి తన హెల్త్ ఇష్యు పై స్పందించారు. తను హెల్త్ బాగోనప్పుడు రుచి, వాసన కోల్పాయనని..

మనిషికి కంటి చూపు, వినికిడి ఎంత ముఖ్యమో ఊపిరి పీల్చినప్పుడు వాసన రాకపోయినా, నోటికి రుచి తెలియకపోయినా ఆందోళన కలుగుతుంది, నేను దానినే అనుభవించాను. రుచి, వాసన ను ఇప్పుడిప్పుడే తిరిగి పొందుతున్నాను, అవి కోల్పోయిన వాళ్ళకే వాటి విలువ తెలుస్తుంది. కళ్ళతో చూడడం, చెవులతో వినడం అనేది ఓ వరం.

ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ చెప్పిన మమ్ముట్టి అసలు తన అనారోగ్యం ఏమిటి అనే విషయం పూర్తి స్పష్టత ఇవ్వకపోయినా.. తాను ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడ్డానో అనేది మాత్రం చెప్పుకొచ్చారు. 

Mammootty opens up about temporary loss of smell and Taste

mammootty