అనుపమ అందం అజంతా శిల్పం
Anupama Parameswaran latest look viralక్యూట్ అండ్ కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కొద్ధిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం సుకుమార్ తో రామ్ చరణ్ చెయ్యబోయే RC 17 లో అనుపమ పేరు తెరపైకి రావడంతో ఇప్పుడు ఆమె క్రేజీగా మారిపోయింది. ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ కి స్టార్ హీరోల సరసన అవకాశం దక్కలేదు.
గతంలో సుకుమార్-రామ్ చరణ్ కలయికలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలంలో అనుపమ పరమేశ్వరన్ కి ఛాన్స్ రాగా.. ఆమె ఆ పాత్రను వదులుకుంది అనే టాక్ ఉంది. దీనికి రకరకాల కారణాలు వినిపించాయి, అనుపమ పరమేశ్వరన్ కూడా ఓ సందర్భంలో కన్ఫ్యూజ్ చేస్తూ ఆన్సర్ ఇచ్చింది.
ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అనుపమ పరమేశ్వరన్ వదిలే ఫోటోలు ఈ మధ్యన గ్లామర్ గా షాకిస్తున్నాయి. ఎక్కువగా ట్రెడిషనల్ గా కనిపించే అనుపమ కొన్నాళ్లుగా గ్లామర్ వైపు టర్న్ అయ్యింది. తాజాగా JFW అవార్డ్స్ ఈవెంట్ కి హాజరైన అనుపమ తన లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆమె వదిలిన పిక్స్ చూస్తే అనుపమ అందం అజంతా శిల్పం అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పోతపోసిన శిల్పంలా అనుపమ లేటెస్ట్ ఫొటోస్ మాత్రం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Anupama Parameswaran at the JFW Movie Awards 2026







































