దువ్వాడ ఫ్యామిలీతో బిగ్ బాస్ తనూజ
Thanuja and Duvvada Madhuri Visited Srisailam Templeబిగ్ బాస్ సీజన్ 9 నుంచి రన్నర్ గా వచ్చిన తనూజ పుట్టస్వామి.. విన్నర్ కళ్యాణ్, మిగతా కంటెస్టెంట్స్ మాదిరి యాక్టీవ్ సోషల్ మీడియాలో ఉండకపోయేసరికి ఆమె అభిమానులు బాగా హార్ట్ అయ్యారు. తనూజ షాప్ ఓపినింగ్స్ తోనూ అలాగే స్టార్ మా ప్రోగ్రామ్స్ లో లైట్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియా పోస్ట్ లు తక్కువగా షేర్ చేస్తుంది.
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అంతా రీ-యూనియన్ అంటూ స్టార్ మా డిజైన్ చేసిన ప్రోగ్రాం లో తనూజ మిగత కంటెస్టెంట్స్ తో మింగిల్ అయిన ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. తనూజ తో హౌస్ లో బాగా ఫ్రెండ్ షిప్ చేసిన విన్నర్ కళ్యాణ్, దివ్వెల మాధురి తో సరదాగా ఫొటోస్ కూడా దిగింది తనూజ.
ఇక మహాశివత్రి రోజున దివ్వెల మాధురి అలాగే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురితో తనూజ పుట్టస్వామి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆ ఫొటోస్ ని తెగ షేర్ చేస్తున్నారు. హౌస్ లో తనూజ ని తన బిడ్డలా చూసుకుంది మాధురి. మధ్యలో భరణి వచ్చినా మాధురి ని వదలకుండా తనూజ ఆమెతో కలిసి మూడు వారాలు సరదాగా ఉంది. బయట కూడా ఇలా వారి ఫ్రెండ్ షిప్ కొనసాగుతుందన్నమాట.
Bigg Boss9 Thanuja With Divvela Madhuri At Srisailam






































