పెళ్లి వార్తలపై కౌంటర్ వేసిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur counters marriage news

కొన్నాళ్లుగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉంది.. సీక్రెట్ డేటింగ్ చేస్తుంది, త్వరలోనే పెళ్లి కాదు కాదు ఫిబ్రవరి 14 న అత్యంత గోప్యంగా మృణాల్ ఠాకూర్-ధనుష్ ని వివాహమాడనుంది అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై ఎప్పటికప్పుడు మృణాల్ టీం క్లారిటీ ఇస్తుంది, మృణాల్ ఠాకూర్ ఇండైరెక్ట్ గా చెబుతుంది.

తాజాగా మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలపై వేసిన కౌంటర్ హాట్ టాపిక్ అయ్యింది. నిన్నటివరకు ఫిబ్రవరి 14 న పెళ్లి అన్నారు, ఇప్పుడు అది ఏప్రిల్ 1 కి మారినట్టుగా ఉంది. ఈ పెళ్లి ని ఎన్నిసార్లు చేస్తారు, ఏప్రిల్ 1 అంటే ఫూల్స్ డే, అందుకే ఇలాంటివి పుట్టిస్తున్నారు. అసలు ఇలాంటివి ఎవరు పుట్టిస్తారో తెలియదు.

నేనే వాళ్లతో చెప్పినట్టుగా అదే నిజమని చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారు. అదే భయపడేలా చేస్తుంది. అంటూ ధనుష్ తో పెళ్లి పుకార్లపై మృణాల్ ఠాకూర్ డైరెక్ట్ గానే కౌంటర్ వేసింది. 

Mrunal Thakur breaks silence amid wedding rumours with Dhanush

mrunal thakur