అశ్వత్థామ కథతో దురంధర్ జోడీ రిపీట్
Ranveer Singh and Sara Arjunరణ్ వీర్ సింగ్ ఇప్పుడు 1000 కోట్ల క్లబ్ హీరో. అతడు నటించిన `దురంధర్` చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 1300 కోట్ల గ్రాస్, 800 కోట్ల నెట్ వసూలు చేసిందని కథనాలొచ్చాయి. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం `దురంధర్ 2` పెండింగ్ చిత్రీకరణలు పూర్తి చేసి రిలీజ్ ప్రచారంలో పాల్గొనబోతున్నాడు రణవీర్. ఆదిత్యాధర్ - రణ్ వీర్ మరోసారి రికార్డులు సృష్టించాలని ప్రణాళికతో ఉన్నారు.
ఇదే సమయంలో రణ్‌వీర్ సింగ్- ఆదిత్యాధర్ జోడీ మరో భారీ చిత్రం కోసం సన్నాహకాల్లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. ఇది పురాణేతిహాసాల ఆధారంగా రూపొందించనున్న అత్యంత భారీ చిత్రమని తెలుస్తోంది. దీనికోసం దాదాపు 500కోట్లు పైగా బడ్జెట్ ని ఖర్చు చేస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిత్యాధర్ గతంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ `ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వథ్థామ`ను ప్రకటించారు. యూరి ఫేం విక్కీకౌశల్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తాడని ప్రచారమైంది.
కానీ అది బడ్జెట్ పరమైన క్రైసిస్ కారణంగా ఆగిపోయిందని కూడా కథనాలొచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ మధ్యలోనే ఆదిత్యాధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు రణ్ వీర్ తో చేయబోయే మైథాలజీ సబ్జెక్ట్ అశ్వథ్థామ కథతోనేనా? అనే ఆసక్తి నెలకొంది. ఆదిత్యాధర్ అశ్వధ్థామ ప్రాజెక్ట్ కాకుండా మరో మైథాలజీ కథను రాసుకున్నాడా? అన్నదానిపైనా ఇంకా స్పష్ఠత రావాల్సి ఉంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
Dhurandhar pair-Ranveer Singh and Sara Arjun







































