ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bail Granted-But Will Ambati Be Released

అంబటి కి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..

Bail Granted-But Will Ambati Be Released

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో 14 రోజులు రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కి రెండు రోజుల క్రితమే గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటి రాంబాబు బెయిల్ పై బయటపడతారనుకున్న సమయంలో పోలీసులు అంబటిని మరోసారి అరెస్ట్ చేసారు.

నవంబర్ 12వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీలో సీఐ విధులను అంబటి అడ్డుకున్నారని, పోలీసులను బెదిరించిన కేసులో అంబటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మూడు రోజుల క్రితం కోర్టులో అంబటిని పట్టాభిపురం పోలీసులు హాజరుపరిచారు.

తాజాగా పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తూ.. ఈ కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు, ఈరోజు బెయిల్ మంజూరు కావడంతో అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం

Ambati Rambabu granted bail

ambati rambabu