అబ్బాయ్ డేట్ కి బాబాయ్ దిగిపోతాడా

Ustaad Bhagat Singh Release DateUstaad Bhagat Singh Release Date

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న`పెద్ది` రిలీజ్ విష‌యంలో నీలి నీడ‌లు క‌మ్మిన సంగ‌తి తెలి సిందే. మార్చి 26న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆ తేదీకి వ‌స్తుందా?  లేదా? అన్న దానిపై సందిగ్ద‌త కొనసాగుతోంది. దాదాపు రిలీజ్ ఉండ‌ద‌న్న‌ది బ‌ల‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే  ఆ తేదీకి బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిగే అవ‌కాశం ఉందా? అంటే అవున‌నే టాక్ ఫిలిం స‌ర్కిల్స్ లో మొద‌లైంది.

ప‌వ‌న్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో `ఉస్తాద్ భగ‌త్ సింగ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.  అన్ని ప‌నులు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా `పెద్ది` రిలీజ్ పై సందేహం వ్య‌క్త‌మ‌వ్వ‌డంతో? అదే తేదీకి పీకే సినిమా రిలీజ్ చేసే దిశ‌గా హ‌రీష్ అండ్ కో ప్లాన్ చేస్తోందిట‌.

దీంతో నిర్మాణానంత‌ర ప‌నుల్ని వేగ‌వంతం చేసిన‌ట్లు తెలిసింది. మార్చి 15 క‌ల్లా సెన్సార్ మిన‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని సిద్దంగా ఉంటే? రిలీజ్ సాధ్య‌మే. ఏప్రిల్ రిలీజ్ అంటే ఎండ‌లు ముదిరే స‌మ‌యం. ప్రేక్ష‌కులు థియేట‌ర్ కు రావ‌డానికి ఆలోచిస్తారు. ఆ కోణంలో మార్చిలో రిలీజ్ స‌రైన స‌మ‌య‌మే. సెల‌వులు కూడా అప్పుడే ఆరంభ‌మ‌వుతాయి.   

 

 

Peddi Release Date in Jeopardy Due to Ustaad Bhagat Singh

ustaad bhagat singh