నాగ చైత‌న్య నుంచి మ‌రో దూత‌

Naga Chaitanya

యువ సామ్రాట్ నాగ చైత‌న్య `దూత` తో వెబ్ సిరీస్ వ‌ర‌ల్డ్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. తొలి సిరీస్ తోనే ఘ‌న విజ‌యాన్ని అందుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన  సస్పెన్స్  క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులు, విమర్శకుల ప్ర‌శంస‌లందుకుంది. ప్ర‌త్యేకించి నాగ చైత‌న్య సెటిల్డ్ పెర్పార్మెన్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

గ్లోబ‌ల్ స్థాయిలోనూ చైత‌న్య ఇదే సిరీస్ తో క‌నెక్ట్ అయ్యాడు. అమెజాన్ ప్రైమ్ గ్లోబల్ టాప్ చార్ట్స్‌లో కూడా ఈ సిరీస్ నిలిచింది. ద‌ర్శ‌కుడు విక్రమ్ కె. కుమార్ మ‌రోసారి త‌న ప‌ని త‌నంతో ఆక‌ట్టుకున్నాడు. తాజాగా ఈ సిరీస్ కు కొన‌సాగింపుగా `దూత 2`ని ప‌ట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే విక్ర‌మ్.కె. కుమార్ దీనికి సంబంధించి  స్క్రిప్ట్ కూడా సిద్దం చేసార‌ని స‌మాచారం.

మిగతా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. దీంతో విక్ర‌మ్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు? అన్న‌ది ఆసక్తిక‌రంగా మారింది. విక్ర‌మ్.కె. పాత క‌థ‌ని చెప్పినా? దాన్ని కొత్త‌గా చెప్ప‌డం, ఆస‌క్తిక‌ర క‌థ‌నంతో ముందుకు న‌డి పించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. `థాంక్యూ` త‌ర్వాత విక్ర‌మ్ మ‌రో సినిమా డైరెక్ట్ చేయ‌ని సంగ‌తి తెలిసిందే.

కొన్ని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ హీరోలంతా బిజీగా ఉండ‌టంతో చేయ‌లేక‌పోయారు. ఈ మ‌ద్య‌లోనే `దూత` సిరీస్ తో ముందుకొచ్చాడు. ఇప్పుడా సిరీస్ కు కంటున్యూటీతో ముందుకొస్తున్నారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య `వృషక‌ర్మ` చిత్రం లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే `దూత 2` లో జాయిన్ అయ్యే అవ‌కాశం ఉంది.  

 

Naga Chaitanya Dhootha

naga chaitanya