స్వేచ్ఛ కేసులో పూర్ణచందర్ పై పోక్సో కేసు

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఆమెతో సహజీవనం చేసిన పూర్ణచందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. స్వేచ్ఛ పూర్ణచందర్ తో కలిసే ఉండేదని, అతను ఇబ్బంది పెట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని స్వేచ్ఛ పేరెంట్స్ ఆరోపిస్తే..
పూర్ణచంద్రావు మాత్రం స్వేచ్ఛ కుమార్తెను తన కుమార్తెలా చూసుకున్నానని.. ఆమెను మంచి స్కూల్లో చేర్పించి ఫీజులు కడుతున్నానని అంతేకాకుండా ఆమె ఫంక్షన్‌కు తాను ఐదు లక్షలు ఖర్చు పెట్టానని, స్వేచ్ఛ ఆమె తల్లితండ్రుల వలనే ఆత్మహత్య చేసుకుంది అని పూర్ణచందర్ మీడియాకు రిలీజ్ చేసిన లేఖలో చెప్పుకొచ్చాడు. కానీ స్వేచ్ఛ కుమార్తె వెర్షన్ మరోలా ఉంది.
పూర్ణచందర్ మంచివాడు తన తల్లినే కాదు తనని కూడా వేదించేవాడని, స్వేచ్ఛ కుమార్తె పూర్ణచందర్ వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పూర్ణచందర్ పై పోలీసులు పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆమె సూసైడ్ లెటర్ రాయకపోవడంతో ఈ కేసులో పూర్ణచందర్ బయటపడతాడని అంతా అనుకున్నారు, కాని స్వేచ్ఛ కూతురు కంప్లైంట్ తో పూర్ణచందర్ అడ్డంగా ఇరుక్కున్నాడు.
Pocso Case Against Jailed Accused in Swetcha Suicide case
POCSO case against Poornachander in Swetcha case







































