హిట్ డైరెక్టర్ ని చైతు ఎలా మిస్ అయ్యాడో

How Chaitu missed the hit director

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో అక్కినేని హీరో నాగ చైతన్య ఐదు సార్లు ఛాన్స్ లు మిస్ చేసుకోవడం నిజంగా అక్కినేని అభిమానులను డిజప్పాయింట్ చేసే న్యూసే. గత ఏడాది లక్కీ భాస్కర్ తో బిగ్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి-నాగ చైతన్య కలయికలో ఐదు సార్లు సినిమా తెరకెక్కించే ఛాన్స్ వచ్చినా అది మిస్ అయ్యిందట. 

ఆ విషయం స్వయానా వెంకీ అట్లూరినే చెప్పడం విశేషం. తను తెరకెక్కించిన అయిదు సినిమాల కథలు ముందు నాగ చైతన్యకే వినిపించానని, కానీ డేట్లు, మరికొన్ని కారణాల వల్ల తమ కాంబోలో సినిమా మిస్సయ్యిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

మరి వెంకీ అట్లూరి నుంచి వచ్చిన గత ఐదు సినిమాలు  తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే, సార్ అలాగే గత ఏడాది 100 కోట్ల క్లబ్బు లోకి వెళ్లిన లక్కీ భాస్కర్. ఈ చిత్రాల్లో తొలిప్రేమ, సార్ చేస్తే సూపర్ హిట్స్ చైతు ఖాతాలో పడేవి, ముఖ్యంగా లక్కీ భాస్కర్ లాంటి హిట్ చైతు మిస్ అవడమే అక్కనేని అభిమానులను నిరాశపరిచింది. 

ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో తన తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఇక నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు తో NC 24 లో నటిస్తున్నాడు. 

Why Is Naga Chaitanya Rejecting Venky Atluri?

venky atluri