థగ్ లైఫ్ ఫెయిల్యూర్ పై మణిరత్నం క్షమాపణ
Mani Ratnam about Thug Life failureమణిరత్నం-కమల్ హాసన్ కలయికలో ఎన్నో ఏళ్ళ తర్వాత అంటే నాయకుడు తర్వాత తెరకెక్కిన థగ్ లైఫ్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా భారీ అంచనాల నడుమ జూన్ 5 న థియేటర్స్ లో విడుదలైంది. కమల్ హాసన్-శింబు నడుమ గ్యాంగ్ స్టర్ కథ తో మణిరత్నం థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కించారు. థగ్ లైఫ్ ప్రమోషనల్ కంటెంట్ కానీ, థగ్ లైఫ్ కి టీమ్ చేసిన ప్రమోషన్స్ కానీ సినిమాపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసాయి.
కానీ ఆ అంచనాలను థగ్ లైఫ్ అందుకోలేకపోయింది. థగ్ లైఫ్ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ ఇద్దరి నుంచి యునానమస్ గా డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజుకే థియేటర్స్ లో థగ్ లైఫ్ పనైపోయింది. కమల్ హాసన్ కేరెక్టర్ దగ్గరనుంచి మణిరత్నం మేకింగ్ వరకు, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ దగ్గర నుంచి త్రిష కేరెక్టర్ వరకు అన్ని విమర్శలే.
తాజాగా థగ్ లైఫ్ ఫెయిల్యూర్ పై దర్శకుడు మణిరత్నం ఓపెన్ అయ్యారు. మేము గతంలో చేసిన నాయకుడి తరహాలో ఓ సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మళ్లీ అదే తరహా సినిమా ఎందుకు చేయాలి, అని పూర్తిగా కొత్తగా ప్రయత్నించాం. కానీ ఆడియన్స్ అంచనాలు ఎక్కువ పెట్టుకున్నారు. అందులోనే తేడా కొట్టింది. మేము ఇచ్చింది, వాళ్లు ఊహించినది వేరేలా ఉండటం వల్ల ఇలా జరిగింది, ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసిన అంచనాలు అందుకోవడం విఫలమయ్యాం అంటూ మణిరత్నం థగ్ లైఫ్ ఫెయిల్యూర్ పై ఎమోషనల్ అయ్యారు.
We are sorry – Mani Ratnam opens up about Thug Life failure







































