కాంతార 1 చుట్టూ కమ్ముకున్న కారు మబ్బులు

రిషబ్ శెట్టి దర్శకుడు కమ్ హీరో గా తెరకెక్కిన కాంతార చిత్రం ఎలాంటి హడావిడి లేకుండా తెరకెక్కడమే కాదు, ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా మార్కెట్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. దానితో రిషబ్ శెట్టి కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ని అనౌన్స్ చేసారు. ఈ అక్టోబర్ 2న సినిమా విడుదల కావాల్సి ఉంది.
కానీ ఈ మధ్యలో కాంతార చాప్టర్ 1 షూటింగ్ చుట్టూ దురదృష్టమో లేదంటే.. అపశకునాలో కానీ.. కాంతార 1సెట్ లో తరుచు జరుగుతున్న మరణాలు, ప్రమాదాలు.. కాంతార టీమ్ ని టెన్షన్ పెడుతున్నాయి. ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్ ల బస్సు బోల్తా పడడం, తర్వాత కాంతార టీమ్ లోని ఓ ఆర్టిస్ట్ నీళ్లలో మునిగి చనిపోవడం, ఆతర్వాత కాంతార నటులు ఇద్దరు దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడం.. ఇలా వరస సంఘటనలు చూసిన వారు కాంతార చాప్టర్ 1ను వెంటాడుతున్న మరణాలంటూ మాట్లాడుకుంటున్నారు.
మరోపక్క బెంగళూరు శివారులో అడవిని కొట్టేశారని స్వయంగా కాంతార టీమ్ పై ప్రభుత్వం వేసిన కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. తాజాగా కర్ణాటక రాష్ట్రం శివమొగా జిల్లా మణి జలాశయంలో కాంతార టీమ్ ప్రయాణం చేస్తున్న బోటు హఠాత్తుగా బోల్తా పడింది, టీమ్ సబ్యులకు ఈత రావడంతో అందరూ సేఫ్ గా ఒడ్డుకు చేరారని వార్తలు రావడంతో.. అందరూ కంగారు పడ్డారు.
కానీ అందులో నిజం లేదు అని, గాలివానకు వేసిన కాంతార సెట్ కూలిపోవడం తప్ప అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని హోంబాలే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. ఏదిఏమైనా ఏదో ఒకరకంగా కాంతార సోషల్ మీడియాలొ ట్రెండ్ అవడం కన్నా, ఇలా ప్రమాదాలతో కాంతార ట్రెండ్ అవడమే మేకర్స్ కు నిద్ర పట్టకుండా చేస్తుంది.
Rishab Shetty and crew escape unhurt after boat capsizes during Kantara: Chapter 1 shoot
Rishab Shetty Kantara Chapter 1 unit suffers another loss








































