మోస‌పోయిన సెల‌బ్రిటీ క‌పుల్

శిల్పా శెట్టి -రాజ్ కుంద్రా పేర్లు కొన్నేళ్లుగా వివాదాల‌తో అంట‌కాగుతున్నాయి. ఇప్పుడు ఈ జంట‌ క్రొయేషియాలో కనిపించారు. శిల్పాశెట్టి 50వ పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ జంట ప్రపంచవ్యాప్తంగా ప‌లు దేశాల‌లో పర్యటిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న శిల్పాశెట్టి త‌న అభిమానుల కోసం నిరంత‌రం ప్రయాణాల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉన్నారు.

దురదృష్టవశాత్తు వీటిలో ఒక వీడియో రాంగ్ రీజ‌న్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో క్రొయేషియాలో విదేశీయుల‌తో గొడ‌వ ప‌డుతున్న‌ప్ప‌టిది. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ విదేశీ పర్యాటకులతో గొడవ పడుతూ క‌నిపించారు. వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాల్లో ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించాయి. జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయాక‌, ఇప్పుడు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆ వీడియో వెన‌క నిజా నిజాల‌ను వెల్ల‌డించారు. గొడవ గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రాజ్ కుంద్రా- శిల్పా శెట్టి నటి 50వ పుట్టినరోజును జరుపుకోవడానికి క్రొయేషియాలోని ఒక రెస్టారెంట్ వ‌ద్ ఉన్నారు. విదేశీయుల‌తో శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా గొడవ ప‌డ‌టానికి కార‌ణం.. ఏజెంట్ చేతిలో మోస‌పోవ‌డం. శిల్పాశెట్టి 50వ పుట్టిన‌రోజు కోసం సంవ‌త్స‌రం క్రిత‌మే క్రొయేషియాలోని ఒక పాపుల‌ర్ రెస్టారెంట్ లో గ్రూప్ టేబుల్ ని బుక్ చేసాడు కుంద్రా. కానీ అదే టేబుల్ ని ఏజెంట్ డ‌బుల్ బుకింగ్ చేసాడు. వేరొక గ్రూప్ కి కూడా అదే టేబుల్ ని బుక్ చేసాడు. 

దీంతో విదేశీ ప‌ర్యాట‌కుల‌తో గొడ‌వ మొద‌లైంద‌ని కుంద్రా వెల్ల‌డించాడు. తాను, త‌న భార్య పిల్ల‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్లు అయిన త‌న త‌ల్లిదండ్రులు, అత్త‌గారు, మ‌రో ఇర‌వై మంది అతిథుల‌తో ఆ రెస్టారెంట్ వ‌ద్ద ఎదురు చూడాల్సి వ‌చ్చింద‌ని, పుట్టిన‌రోజు పార్టీ అన‌వ‌స‌ర‌మైన ఒత్తిడిగా మారింద‌ని కుంద్రా ఆందోళ‌న చెందాడు. రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి జంట ఇటీవ‌ల కొన్ని సీరియ‌స్ కోర్టు కేసులలో న‌లిగిన‌ త‌ర్వాత ఇప్పుడు జాలీ లైఫ్ ని ఆస్వాధిస్తున్నారు. అది కూడా అన‌వ‌స‌ర ఒత్తిళ్ల‌ను పెంచింది.

Raj Kundra and Shilpa Shetty faced a heated incident at a Croatian restaurant

Star couple deceived by foreign agent
raj kundra