కన్ ఫర్మ్: ఎన్టీఆర్ తో త్రివిక్రమ్
Confirmed: Trivikram with NTRదర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో కమిట్ అయిన ప్రాజెక్ట్ ఆగిపోగా.. ఆయన తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా అనే న్యూస్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
అల్లు అర్జున్ స్క్రిప్ట్ తోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తారని అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో అనే విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలోనే నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని కన్ ఫర్మ్ చేసారు. ఈమద్యలో త్రివిక్రమ్-రామ్ చరణ్ కలయికలో ఓ మూవీ అని చక్కర్లు కొడుతున్న న్యూస్ పై నాగవంశీ క్లారిటీ ఇస్తూ త్రివిక్రమ్ లైనప్ పై స్పష్టతనిచ్ఛారు.
ప్రస్తుతానికి త్రివిక్రమ్ గారు వెంకటేష్, ఎన్టీఆర్ అన్నతో మాత్రమే సినిమాలు చేస్తున్నారని ఇవి కాకుండా త్రివిక్రమ్ గారు మరో సినిమా ఓకే చేయలేదని త్రివిక్రమ్ లైనప్ పై ఏ రూమర్స్ నమ్మొద్దు, ఒకవేళ ఏమన్నా ఉంటే తమ నుంచే పూర్తి వివరాలు బయటకి వస్తాయని నాగవంశీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు
Producer Naga Vamsi Confirms Trivikram Srinivas Next Two Films







































