Advertisement

కవిత విషయంలో కేసీఆర్ మౌనం ఎందుకు

Why Is KCR Ignoring Kavitha

కల్వకుంట్ల కవిత.. తండ్రి కెసిఆర్ కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఆ లేఖ తను అమెరికా వెళ్లకముందు తండ్రికి రాస్తే అది ఇప్పుడు లీక్ అవడం వెనుక కుట్ర దారులున్నారు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయ్ అంటూ కవిత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే సంచలన వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుంది అంటూ సంచలనాలకు తెర తీసింది. 

తనని కావాలనే ఎంపీ ఎన్నికల్లో ఓడించారు, బిజెపి తో కలిసి బీఆర్ఎస్ ని విలీనం చేసే కుట్ర జరిపారని, తనని జైలు కు పంపించిన బిజెపి తో కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లే స్నేహం చేస్తున్నారని అన్న కేటీఆర్ పై, హరీష్ రావు పై, సంతోష్ పై కవిత ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేసింది.  కవిత లేఖ లీకవడం, కవిత బయట పలు సందర్భాల్లో చేస్తున్న కామెంట్లపై కేసీఆర్ మౌనం వహిస్తున్నారు. 

ఒకవేళ కేసీఆర్ గనక కవిత విషయంలో స్పందిస్తే ఇరుక్కున్నట్టే అని భావిస్తున్నారా, అందుకే కూతురు విషయంలో రియాక్ట్ అవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత విషయం చాలా సెన్సిటివ్, కూతురు వైపు మాట్లాడితే బీఆర్ఎస్ నుంచి సెగ తగులుతుంది, కాదు కవిత పై ఫైర్ అయితే కూతురు చేజారిపోయే అవకాశం ఉంది, కొత్త పార్టీ పెట్టేస్తుంది అనే భయం మరో వైపు. 

అసలే కాంగ్రెస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ జుట్టుని అందించింది కవిత, ఒకవేళ తాను కూడా రియాక్ట్ అయితే అది కాంగ్రెస్ కు బలంగా మారుతుంది అని అందుకే కేసీఆర్ ఈ విషయంలో మౌనం వహిస్తున్నారనే మాట వినబడుతుంది. కానీ కేసీఆర్ స్పందించకపోతే అది ఇంకాస్త డేంజర్ గా మారుతుంది, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని బీఆర్ఎస్ నేతలే మాట్లాడుకోవడం గమనార్హం. 

KCR Silence Can Be A Big Danger

kcr