ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeleela Sparks Wedding Rumours With Haldi Pics

ఏంటి.. శ్రీలీలకు పెళ్ళా

Sreeleela Sparks Wedding Rumours With Haldi Pics

హీరోయిన్ శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఎవరు? అందరూ అనుకుంటున్నట్టుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కాదు కదా? లేదంటే శ్రీలీల అలాంటి అంటే హల్దీ సెర్మోని ఫొటోస్ ను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేసింది? ఇన్ని అనుమానాలు, పలు ప్రశ్నలు శ్రీలీల లేటెస్ట్ పోస్ట్ చుట్టూ తిరుగుతున్నాయి.

టాలీవుడ్ లో శ్రీలీల ఒక రేంజ్ లో సినిమాలు చేసింది. వరస సినిమాలు చేస్తూ ఒక్కసారిగా బిజీ అయ్యింది, ఇప్పుడు కోలీవుడ్ అలాగే హిందీ చిత్ర సీమలోను బిజీ అవుతోంది. క్రేజీ హీరో లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న శ్రీలీల కొద్దిరోజులుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. 

తాజాగా శ్రీలీల మెడకు గంధం రాయించుకుంటూ, బొట్టు పెట్టించుకుని తాంబూలం అందుకుంటూ అచ్చం నిశ్చితార్ధపు పెళ్లికూతురులా మెరిసిపోతున్న ఫొటోస్ ను షేర్ చేస్తూ బిగ్ డే, కమింగ్ సూన్ అనే క్యాప్షన్ పెట్టేసరికి శ్రీలీల కు నిశ్చితార్ధం అవుతుంది, అందుకే ఆ ఫొటోస్ ని షేర్ చేసింది. ఆ నిశ్చితార్ధం కార్తీక్ ఆర్యన్ తోనేనా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరి శ్రీలీల ఆ బిగ్ డే ఏమిటో త్వరగా రివీల్ చెయ్యకపోతే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడదు, ఆమె రియాక్ట్ అవడం లేట్ అయ్యింది అంటే  ఆమె అభిమానులకు పిచ్చెక్కిపోవడం ఖాయం. 

Srileela Mysterious Post in Bridal Attire Goes Viral

sreeleela