Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vicky Kaushal To Play Guru Dutt In Legend Biopic

లెజెండ్ బ‌యోపిక్‌లో చావా హీరో

Vicky Kaushal To Play Guru Dutt In Legend Biopic

2025లో `చావా` లాంటి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందుకున్నాడు విక్కీ కౌశ‌ల్. స‌ల్మాన్ ఖాన్ లాంటి పెద్ద హీరో సాధించ‌లేని ఫీట్ సాధించాడు విక్కీ కౌశ‌ల్. అత‌డు న‌టించిన `చావా` బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 700 కోట్లు పైగా వ‌సూలు చేయడం ఒక చ‌రిత్ర‌. శంభాజీ మ‌హారాజ్ గా అత‌డి న‌ట‌న‌కు ప్ర‌జ‌లు జేజేలు ప‌లికారు. అందుకే విక్కీ త‌దుప‌రి చిత్రాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. విక్కీ కౌశ‌ల్ త‌దుప‌రి ర‌ణ‌బీర్ తో క‌లిసి `ల‌వ్ అండ్ వార్` లో న‌టిస్తున్నాడు. భ‌న్సాలీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇంత‌లోనే ఇప్పుడు లెజెండ‌రీ బాలీవుడ్ ఫిలింమేక‌ర్ గురుదత్ పై ఒక బయోపిక్ లో టైటిల్ పాత్ర‌కు అత‌డి పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. దీనిని గురుద‌త్ 100వ జయంతికి ముందు లేదా ఆ రోజున ప్రకటించవచ్చు.  మిడ్-డే క‌థ‌నం ప్రకారం పూర్తి స్థాయి బయోపిక్ కోసం ముందస్తు చర్చలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ కు న్యాయం చేయాలంటే విక్కీ కౌశ‌ల్ స‌రైన వ్య‌క్తి అని భావిస్తున్నార‌ట‌. అత‌డు అయితేనే గురుదత్ లోని భావోద్వేగాల‌ను స‌రిగా తెర‌పైకి తేగ‌ల‌డ‌ని న‌మ్ముతున్నారు.  

గురుద‌త్ సినిమాలు అంత‌ర్జాతీయ గుర్తింపు పొందిన క్లాసిక్స్. ఈ ఏడాది కేన్స్ ఉత్స‌వాల్లోను ఆయ‌న సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించారు. రీమాష్ట‌ర్ చేసిన వెర్స‌న్ల‌ను ఇక్క‌డ‌ ప్రదర్శించారు. వాటిలో ప్యాసా (1957), కాగజ్ కే ఫూల్ (1959), చౌద్విన్ కా చంద్ (1960), సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962) ఉన్నాయి. అయితే తాను గురుద‌త్ పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యాన్ని  నిర్మాతలు లేదా విక్కీ కౌశల్ ధృవీకరించలేదు. నటుడితో చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయో లేదో తెలియదు. అయితే గురు దత్ బయోపిక్ త్వరలో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లే ఛాన్సుంద‌ని మాత్రం తెలిసింది. 

Vicky Kaushal To Play Guru Dutt In The Icon Biopic

vicky kaushal