క్షమాపణలు చెప్పకపోతే ఖలేజా చూడలేం

నిర్మాత సి కళ్యాణ్ మహేష్ అభిమానులే అపుడు ఖలేజా చిత్రాన్ని ఆడనివ్వకుండా చంపేశారు, సినిమా విడుదలైన రోజు మిడ్ నైట్ షో పూర్తయ్యాక మహేష్ అభిమానులు దర్శకుడిని, నిర్మాతలను సినిమాలు తియ్యడం చేతకాకపోతే ఆపెయ్యండి, అంటూ ఫోన్ చేసి బండబూతులు తిట్టారు, తాగి ఖలేజా చిత్రం పై నెగెటివ్ మెసేజెస్ స్ప్రెడ్ చేసి సినిమాని చంపేశారంటూ కళ్యాణ్ తాజాగా ఖలేజా రీ రిలీజ్ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు మహేష్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాయి. 

నిర్మాత కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు మహేష్ అభిమానులు, అంతేకాదు కళ్యాణ్ ను సోషల్ మీడియాలలో ట్రోల్స్ చేస్తూ.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే ఖలేజా చిత్రాన్ని చూడలేం అని తెగేసి చెబుతున్నారు. 

మరో అభిమాని సోషల్ మీడియా వేదికగా.. 

ఘట్టమనేని వంశ అభిమానుల మనోభావాల్ని కించపరిచిన సినీ పరిశ్రమలోని మహామహుల్ని సైతం మట్టికరిపించిన మహోన్నత ఘన చరిత్ర మనది.. మన ఘట్టమనేని వారి ఖ్యాతి స్థాయిలో ఉంచడం కోసం మనలోని ప్రతి ఒక్కరు ఎన్నో సాహసాలు, త్యాగాలు చేసి కూడా తమ వ్యక్తిగత జీవితంలో మనోస్తైర్యాన్ని కోల్పోయినప్పుడు కూడా దాన్ని మరలా మనం తిరిగి పొందే ఏకైక ఉపశమన మార్గంతో కూడిన ఏకైక మందు మన ఘట్టమనేని కథానాయకుల చిత్రాలే..మనం మన చేతులారా మన చిత్రాలను చంపుకోవడం అంటే మన చేతులతో మన కంటిని పొడుచుకోవడమే.. నిజాయితిగా ప్రేమించడం తప్ప మరొకటి తెలియని మనల్ని ఎవడో మోసపూరిత వ్యక్తి అవమానిస్తే సహించే ప్రసక్తే లేదు.. ఖలేజా చిత్ర థర్డ్ పార్టీ నిర్మాత సి. కల్యాణ్ మన మనోభావాల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా ప్రతి అభిమాని, ప్రతి థియేటర్ వద్ద ప్రపంచవ్యాప్తంగా తమ నిరసన తెలిపి తను క్షమాపణ చెప్పే వరకు మన పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ పోస్ట్ పెట్టారు. 

Mahesh Fans Blamed for Khaleja Flop

Mahesh fans fires on C Kalyan
mahesh