Loading...

భైరవం అయినా బోణి కొడుతుందా

Bhaiaravam Releasing tomorrow

సమ్మర్ హాలిడేస్ అన్నీ పెద్ద సినిమాలు లేకుండానే గడిచిపోయాయి. గత మూడు నెలలుగా చిన్న చితక సినిమాలు తప్ప పెద్ద సినిమాలు లేవు. మధ్యలో హిట్ 3, సింగిల్ లాంటి చిత్రాలు తప్ప కాస్త పేరున్న సినిమాలేవీ సమ్మర్ సెలవల్లో రిలీజ్ అవ్వలేదు. హరి హర వీరమల్లు, రాజా సాబ్, విశ్వంభర, మాస్ జాతర ఆఖరికి కింగ్ డమ్ కూడా సమ్మర్ ని వదిలేసాయి. 

సమ్మర్ హాలిడేస్ పూర్తవుతున్న సమయంలో మే చివరి వారంలో చివరి తేదికి విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్- నారా రోహిత్-మంచు మనోజ్ ల కలయికలో తెరకెక్కిన భైరవం రిలీజ్ అవుతుంది. రేపు అంటే మే 30 శుక్రవారం భైరవం రిలీజ్ కి సిద్ధమైంది. ప్రెజెంట్ థియేటర్లు కి భైరవం అయినా బోణి కొడుతుందా అంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు. 

భైరవం తర్వాత వరసగా థియేటర్స్ లో పెద్ద సినిమాల విడుదల జాతర మొదలు కాబోతుంది. జూన్ 5 కమల్ హాసన్-మణిరత్నం ల థగ్ లైఫ్, జూన్ 12 పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, జూన్ 20 కుబేర ఇలా వరసగా ప్రతి వారము పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

విడుదలలు ఓకె, ఇందులో ఎన్ని హిట్ అవుతాయో తెలియదు కానీ.. ఆ హిట్ ని భైరవం తో మొదలు పెట్టాలని ఆడియన్స్ బాగా కోరుకుంటున్నారు, కారణం ఇంట్రెస్టింగ్ సినిమాలు లేక ప్రేక్షకులకు బోర్ కొట్టి అల్లాడిపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ కోసం వెయిటింగ్.  

Bhaiaravam Releasing May 30th

bhaiaravam