నెగెటివ్ ట్రోలింగ్ పై పూజ హెగ్డే కామెంట్స్
Pooja Hegde comments on negative trollingహీరోయిన్ పూజ హెగ్డే పై నెగెటివ్ ట్రోలింగ్ జరిగిందా, ఆమె సక్సెస్ ని తట్టుకోలేక ఆమెపై కొంతమంది డబ్బులిచ్చి ట్రోలింగ్ చేయించారా, ఇప్పుడు ఇదే ఆరోపణలు చేస్తుంది పూజ హెగ్డే. తాజాగా పూజ హెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేయించడం, పిఆర్ టీం తో కావాలని తనపై ట్రోల్ చెయ్యడం బాధ కలిగించాయంటుంది.
మీమ్ పేజెస్ లో నన్ను వరసగా తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. అదేంటి నన్ను వరసగా తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారు అనుకున్నాను, కానీ ఆ తర్వాత అర్ధమైంది. కొంతమంది కావాలనే నన్ను బ్యాడ్ చెయ్యడానికి పిఆర్ టీం కి డబ్బులిచ్చి తిట్టించారని, నన్ను కిందపడేయడానికి ఈ విధంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని చూసి నిజంగా షాకయ్యను.
నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారని నేను నా పేరెంట్స్ చాలా బాధపడ్డాము, నన్ను పతనం చెయ్యడానికి ఇంతిలా దిగజారాలా, డబ్బు ఖర్చు పెట్టాలా అని బాధపడ్డాను అంటూ పూజ హెగ్డే ట్రోలింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
Pooja Hegde subjected to targeted trolls







































