రేవతి మృతిపై బన్నీ రియాక్షన్ ఇదే

డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శితమైన పుష్ప2 ప్రీమియర్‌కి అల్లు అర్జున్ అటెంట్ అవడంతో.. తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ ఓనర్స్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై ఇంత వరకు అల్లు అర్జున్ స్పందించకపోవడంతో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఓ వీడియోను విడుదల చేసి అందులో వివరణ ఇచ్చారు. 

ఈ ఘటనపై ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదన్నారు అల్లు అర్జున్. సినిమా చూసి వెళ్లిన మరుసటి రోజు నాకు విషయం తెలిసింది. చాలా బాధపడ్డాను. దాదాపు 20 ఏళ్ల నుండి ఇలా ప్రధాన థియేటర్స్‌లో సినిమా చూడటానికి వస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. అందరం షాక్‌లో ఉండిపోయాం. ఇన్నేళ్లుగా ఎప్పుడూ జరగలేదు.. ఇదేంటి అని అంతా డిజప్పాయింట్‌తో షాక్‌లోకి వెళ్లిపోయాం. అందుకే పుష్ప సక్సెస్‌ను కూడా సెలబ్రేట్ చేయలేదు.

చాలా బాధేసింది. మేము సినిమాలు తీసేదే మీకోసం. మిమ్మల్ని సంతోషపరచాలని. ఇలాంటి సంఘటనలు ఎంతో బాధిస్తాయి. రేవతి కుటుంబానికి నా తరపున ఎప్పుడైనా, ఎలాంటి సాయమైనా చేస్తానని తెలుపుతున్నాను. తక్షణ సాయంగా రూ. 25 లక్షలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాను. ఇప్పటి వరకు అయిన మెడికల్ ఖర్చులు కూడా అన్నీ నేనే చూసుకుంటాను. ఆ ఫ్యామిలీకి అండగా ఉన్నాననే నమ్మకం ఇవ్వడానికే ఇదంతా. ఇద్దరు పిల్లలకు ఎటువంటి అవసరమైనా.. నేను ఉంటానని తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ థియేటర్లకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండి.. సినిమా చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్లానని కోరుకుంటున్నాను.

Allu Arjun to give Rs 25 lakhs to Revathi Family

Allu Arjun Reacted on Revathi Death
allu arjun