100 కోట్ల లక్కీ భాస్కర్ ఓటీటీ డేట్ ఫిక్స్

Lucky Baskhar OTT date is fixed

దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సెన్సేషన్ లక్కీ భాస్కర్ రెండు వారాలు పూర్తయ్యేసరికి 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టి అందరికి షాకిచ్చింది. అక్టోబర్ 31 న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ అట్లూరి-దుల్కర్ సల్మాన్ ల చిత్రం లక్కీ భాస్కర్ కి ప్రేక్షకులు, సినీవిమర్శకులు యునానమస్ గా సూపర్ హిట్ టాక్ ఇచ్చారు. 

ప్రేక్షకాదరణ బావుండడంతో లక్కీ భాస్కర్ చిత్రం 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. మరి థియేటర్స్ లో అంత పెద్ద హిట్ అయిన లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో పిచ్చ ఆసక్తి మొదలయ్యింది. కొంతకాలంగా ఏ చిత్రమైనా థియేటర్స్ లో విడుదలైన నెల లోపులోనే ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. 

లక్కీ భాస్కర్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తుందో తెలుసా.. నవంబర్ 30నుంచి స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. లక్కీ భాస్కర్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలంటే నెల రోజులకి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. 

Lucky Baskhar OTT release date locked

lucky baskhar