Advertisementt

డాకు మహారాజ్ గా నందమూరి నటసింహం

Fri 15th Nov 2024 11:05 AM
nbk109 is super massy daaku maharaaj  డాకు మహారాజ్ గా నందమూరి నటసింహం
NBK109 is super massy Daaku Maharaaj డాకు మహారాజ్ గా నందమూరి నటసింహం
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ-పవర్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కుతున్న NBK109 చిత్రం పై ట్రేడ్ లో భారీ అంచనాలున్నాయి. మహా శివరాత్రికి వదిలిన పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ లో బాలయ్య మాస్ లుక్ కి నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేసాయి. అప్పటి నుంచి NBK109 టైటిల్ విషయంలో ఊరిస్తూ వస్తున్న మేకర్స్ నేడు నవంబర్ 15 కార్తీక పౌర్ణమి సందర్భంగా టైటిల్ టీజర్ వదిలారు. 

అసలు ఎవరూ ఊహించని టైటిల్ ని NBK109 కి ఫిక్స్ చేసారు. వీర, ఇంకా చాలా టైటిల్స్ ప్రచారంలో ఉన్నప్పటికీ NBK109 చిత్రానికి డాకు మహారాజ్ అంటూ ఎవరి ఊహలకు అందని పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. అంతేకాదు బాలయ్య ను గుర్రమేక్కించి మరీ టైటిల్ తో పాటుగా పవర్ ఫుల్ పోస్టర్ ని, అదిరిపోయే టీజర్ ని కూడా వదిలారు మేకర్స్. 

ఈ కథ వెలుగుని పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది’ అనే డైలాగ్స్ తో టీజర్‌ మొదలైంది. గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్‌, విజువల్స్‌ అన్ని టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. 

డాకు మహారాజ్ గా బాలయ్య గుర్రం పై వస్తుంటే అభిమానులకు పండగే అన్నట్టుగా ఉంది ఆ టీజర్. బాలకృష్ణ ని కొత్త గెటప్ లో చూపించడం లో దర్శకుడు బాబీ 100 శాతం సక్సెస్ అయ్యాడు. టీజర్ కి మెయిన్ హైలెట్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. మరి ఈ టీజర్ చూసాక వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ అభిమానులకు పెద్ద పండగే అని ఫిక్స్ అవ్వాల్సిందే. 

NBK109 is super massy Daaku Maharaaj :

Balakrishna, Bobby, Sithara Entertainments NBK109 is super massy Daaku Maharaaj 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ