చరణ్ కోసం చిరు త్యాగం

Game Changer for Sankranthi 2025

రామ్ చరణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి త్యాగం చేసారు. కొడుకు నటించిన గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ చిరు తాను నటించిన విశ్వంభర ను పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లుగా గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు చెప్పారు. డిసెంబర్ క్రిస్టమస్ కు గేమ్ ఛేంజర్ విడుదల అనుకున్నాము, కానీ సంక్రాంతి అయితే ఇంకా బావుంటుంది వరల్డ్ వైడ్ గా, అంటే కర్ణాటక కానీ, నార్త్ కానీ అన్ని చోట్ల ఆ డేట్ బావుంటుంది అని మేము డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకుని మా ఆలోచనను యువి క్రియేషన్స్, మెగాస్టార్ చిరు ముందు పెట్టాము. 

భారీ బడ్జెట్ చిత్రం విశ్వంభర ను కూడా సంక్రాంతి కి విడుదల అని డేట్ కూడా అనౌన్స్ చేసారు. అందుకే యువి వారిని, చిరంజీవి గారిని అడిగాము, దానికి ఎవరు సానుకూలంగా స్పందించారు. మీ సినిమాను కాస్త వెనక్కి జరిపితే మేము గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేస్తామని అడిగితే వారు ఒప్పుకున్నారు.  

విశ్వంభరకు ఇంకో డేట్ ఏదో అనుకుంటున్నారు. మా గేమ్ ఛేంజర్ కోసం చిరంజీవి గారు విశ్వంభర ను పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటూ చరణ్ కోసం మెగాస్టార్ చేసిన త్యాగం గురించి దిల్ రాజు వివరించారు. 

Official: Ram Charan Game Changer for Sankranthi 2025

game changer