అప్పుడు మోడ్రెన్ - ఇప్పుడు పద్దతి

Then Modren - Now Treditional

నాగ చైతన్య మొదట హీరోయిన్ సమంత ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇరు పెద్దల అంగీకారంతో చైతు సమంత మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత నాలుగేళ్లు బాగానే సాగిన వీరి వివాహ బంధంలో ఏమైందో ఏమో పొరపొచ్చాలు రావడము, డివోర్స్ తీసుకోవడం జరిగిపోయింది. అప్పుడు సమంతతో చైతు పెళ్లి విషయంలో నాగార్జున అమల, అందరూ నాగ చైతన్య కు అండగా నిలబడ్డారు. 

సమంత ని ఇంటి కోడలిగా అంగీకరించారు. ఏదో ఒక అకేషన్ లో సమంత-చైతు, నాగ-అమల, ఇంకా అఖిల్ మోడ్రెన్ డ్రెస్సులతో కలిసి గ్రూప్ పిక్ దిగారు. ఇప్పుడా పిక్ ని అలాగే రీసెంట్ గా శోభిత తో ఎంగేజిమెట్ చేసుకున్న తర్వాత నాగ చైతన్య నాగార్జున, అమల ఇంకా అఖిల్ తో కలిసి సాంప్రదాయ దుస్తులలో ఉన్న గ్రూప్ పిక్ ని పక్కపక్కనపెట్టి కొంతమంది Then - Now అంటే అప్పుడు - ఇప్పుడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు.

అప్పట్లో సమంత తో కలిసి నాగ చైతన్య నాగ్ అండ్ అమల, అఖిల్ తో దిగిన ఫ్యామిలీ, ఇప్పుడు నిశ్చితార్ధం రోజున శోభితతో కలిసి నాగ చైతన్య, నాగ్, అమల, అఖిల్ తో దిగిన పిక్ అది. 

Akkineni family pic goes viral

akkineni family