సజ్జల భార్గవ్ పరార్.. నిజమా?

Sajjala And His Son Bhargav Missing

జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్.. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా మీడియాకి సంబంధించిన వ్యవహారాల్ని చూసుకునేవారు. జగన్ కూడా భార్గవ్ అన్ని తానై చూసుకుంటున్నాడు కదా అని ఆ  సోషల్ మీడియాని అసలు పట్టించుకోలేదు. కానీ భార్గవ్ మాత్రం సోషల్ మీడియా ద్వారా వైసీపీ పై వచ్చే ఆరోపణలు తిప్పి కొట్టడంలో దారుణంగా విఫలమయ్యాడనే వార్తలు బ్లూ మీడియా నుంచే బయటకి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 

దానితో సజ్జల భార్గవ్‌పై అనుమానాలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. అయితే జగన్ ప్రభుత్వం ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కన్నా తానే ఎక్కువ అని ఫీల్ అయి నిర్ణయాలు తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న అతని తనయుడు సజ్జల భార్గవ్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లుగా చెప్పుకుంటున్నారు. రెండ్రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమావేశానికి సజ్జల రామకృష్ణ గైర్హాజరు అవ్వడం, ప్రస్తుతం ఫోన్లు స్విచాఫ్ వస్తుండడంతో హ్తె కమాండ్ ఆరా తీస్తుందట. 

మరోపక్క రామకృష్ణారెడ్డి వల్లే ఓడిపోయామని జగన్ దగ్గర ఎమ్మెల్యేలు గగ్గోలుపెడుతున్నారు. తమను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని గంటలు గంటలు ఆఫీసుల్లో కూర్చోబెట్టి పంపించేవారని సజ్జలు వల్లే తాము ఈ స్థితిలో ఉన్నామని జగన్ ముందు చెప్పి వాపోతున్నట్లుగా తెలుస్తోంది. భార్గవ్ నిర్వాకం వల్ల సోషల్ మీడియాలో చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయల్లో ఆగిపోయాయి. 

మరోపక్క ఆర్థికపరమైన విషయాలు కూడా సజ్జలతో ముడిపడి ఉండటంతో అతనిని వెతికే పనిలో వైసీపీ హై కమాండ్ ఉందని తెలుస్తోంది.

YSRCP High Command Serious on Sajjala And His Son Bhargav

sajjala
bhargav